మనప్రగతి న్యూస్ / నిర్మల్
ఇంటర్ డిస్టిక్ సబ్ జూనియర్ ఉసు ఛాంపియన్షిప్ 2024 వేదం విద్యార్థుల ప్రతిభ హైదరాబాద్లోని హస్తినాపురంలో భవిష్య ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఇంటర్ ది డిస్టిక్ సబ్ జూనియర్ వేదం గ్లోబల్ స్కూల్ నిర్మల్ చెందిన అండర్ 12 క్యాటగిరీలో అనన్య ఉత్తమ ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ ని సాధించింది. అంతేకాకుండా అండర్ 14 క్యాటగిరీలో శృతి ప్రియ మరియు ఆయుష్ ఉత్తమ ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ ని సాధించారు. అదేవిధంగా ఉత్తమ ప్రతిభను కనబరిచి గోల్డ్ మెజర్ సాధించారు వీళ్లు డిసెంబర్ 1 నుండి 6వ తేదీన పంజాబ్లోని చుంబన్ డిస్ట్రిక్ట్ లో జరిగే జాతీయస్థాయిలో పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. అంతేకాకుండా అండర్ 12 మరియు 14 క్యాటగిరీలో వేదం గ్లోబల్ స్కూల్ కి చెందిన లాస్య 7వ తరగతి ,చరణ్ 5వ తరగతి క్లాస్, మణికర్తిక్ 6వ తరగతి తనుశ్రీ 7వ తరగతి , వైష్ణవి, వర్షిత్ కే, కృష్ణ, మనస్విని, స్వీకృతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడలను సాధించారు. అంతేకాకుండా లిఖిత, ప్రసన్న, అన్విత, సృజై, అసిఫ్, కాంసా పథకాలను సాధించారు. సుమారుగా 700 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో మన నిర్మల్ నుండి మూడు గోల్డ్ ఆరు సిల్వర్ మరియు ఏడు కంసా పథకాలను సాధించి రాష్ట్రంలోనే ఛాంపియన్గా నిలిచారు. వీళ్ళ కోచ్ అయినటువంటి సాయినాథ్ ని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. మీ ఈ విద్యార్థులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిర్మల్ డిస్ట్రిక్ట్ రాష్ట్రంలోనే ఉత్తమం ప్రతిమ కనబరిచినందుకు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా అనేక అవాంతరాలను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పిల్లలతో తన అనుభవాలను పంచుకున్నారు.