మనప్రగతి న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:-
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియూ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టై, ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. నిన్న నరేందర్ రెడ్డిని మద్దతుగా, మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు చర్లపల్లి జైలుకు చేరుకుని ఆయనతో ములాఖాత్ చేశారు.ఈ సందర్బంగా హరీష్ రావుతో పాటు పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు కార్తీక్ రెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చర్లపల్లి జైలుకు తరలి వచ్చారు.
హరీష్ రావు మాట్లాడుతూ, పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఎలాంటి సంబంధం లేదని, బీఆర్ఎస్ పార్టీపై అక్రమ కేసులు పెట్టడం కొత్తకాదని అన్నారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుండే ప్రారంభమవుతోంది,” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల జరుగుతున్న అన్యాయం మరియు ప్రజల భూముల విషయంలో ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.