మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో లింగంపేట ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. గురువారం పోలీస్టేషన్లో నేరుగా లంచం తీసకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకున్నారు. ఓ కేసులో శివలింగ గౌడ్ అనే వ్యక్తి నుండి రూ.10 వేలు లంచం తీసుకున్నట్లు సమాచారం. కాగా గడిచిన వారం రోజుల్లో ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి పట్టుబడడం గమానార్హం.