Breaking News

పేదల నడ్డి విరుస్తున్న వడ్డీ.

మన ప్రగతి న్యూస్/
రఘునాథపల్లి :

రఘునాథపల్లి మండల కేంద్రముతో పాటు చుట్టు ఉన్న గ్రామాలలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతుంది. రోజు వారి ఫైనాన్స్ పేరుతో వ్యాపారులు వడ్డీ వసూలు చేస్తూ అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రజల నుండి దోచుకుంటున్నారు.
కొందరు దీనినే వృత్తిగా చేసుకుని ప్రజలకు అప్పులు ఇస్తూ దందా కొనసాగిస్తున్నారు.. చట్ట పరిధిలో ఇది నేరమైన కొందరు యదేచ్ఛగా ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నారు.
అవసరాలకు డబ్బులు తీసుకున్నవారు కూడా దందా గురించి బయట వ్యక్తులకు చెప్పకపోవడం, తప్పని పరిస్థితిల్లో రోజుకు రూ.10 నుండి రూ.20 వడ్డీ కూడా చెల్లిస్తున్నారు.. అధిక వడ్డీ వసూలు అనేది నేరం. అధిక వడ్డీ పలు సందర్భాల్లో ప్రాణాల మీదికి కూడా తెస్తుంది.. తప్పని పరిస్థితుల్లో కొందరు తమ కుటుంబ అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.. తీర్చే సమయంలో మాత్రం గొడవలు, దాడులు చోటు చేసుకుంటున్నాయి.. కొన్ని సందర్భాలలో అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా రఘునాథపల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో ఉన్నాయి..
బెడిసి కొడుతున్న సంబంధాలు లు కూడా ఉన్నవి.
వడ్డీకి డబ్బులు తీసుకుని సమయంలో ఉంటున్న సంబంధాలు ఆ తర్వాత కొనసాగడం లేదు. మానవ సంబంధాల మధ్య గొడవలు జరుగుతున్నాయి…
కొందరు వడ్డీ వ్యాపారులు బంగారం నగలు కుదువ పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారు..
పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారు రాజకీయ నాయకులు మరియు అధికారుల సహకారంతో ఈ దందా ఎక్కువ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు…
కొన్నిచోట్ల పాన్ బ్రోకర్లు కూడా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.. పేపర్ పైన రాసేది ఒకటి ఉంటుంది. వసూలు చేసేది మరొకటిగా ఉంటుంటుందని వడ్డీ భాదితులు తమ భాదను వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధిక వడ్డీ వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులకు అద్దుకట్టు వేయాలని సంబంధిత అధికారులను ప్రజలు మరియు భాదితులు కోరుతున్నారు..

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి