Breaking News

రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం లో హత్య..

మన ప్రగతి న్యూస్/
రఘునాథపల్లి : బాకీగా తీసుకున్న అప్పే తన ప్రాణాలకు ముప్పు అవుతుందని అతను ఊహించలేదు. రఘునాథపల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం లో బుధవారం అర్ధరాత్రి తీసుకున్న అప్పు విషయంలో మాట మాట పెరిగి వేట కొడవలితో నరుక్కునే స్థాయికి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి గూడెంకు చెందిన గంపల పరుశురాములనే దళితుడు అదే గ్రామానికి చెందిన పర్వత మహేందర్ అనే వ్యక్తి వద్ద తన భార్య ఆరోగ్యం విషయమై 80 వేల రూపాయలు అప్పు తీసుకున్నారు. కాలక్రమేణా నాలుగు సంవత్సరాలు గడిచింది ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పరశురాములు తిరిగి డబ్బులు చెల్లించలేక పోయాడు. బుధవారం రాత్రి పర్వత మహేందర్ పరశురాములకు ఫోన్ చేసి తన డబ్బులు ఇవ్వాలని, సంవత్సరాలు గడుస్తున్నా ఇవ్వడం లేదని ఫోన్లో బూతులు తిట్టడం, మాట మాట పెరగడం, పరశురాములు తిట్ట వద్దని చెప్పినప్పటికీ కోపోద్రికుడైన మహేందర్ అతని ఇంటి వద్దకు వెళ్లి వేట కొడవలితో పరుశరాములను తలపై పలుమార్లు నరికాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన జరుగుతున్న సమయంలో పరశురాములు భార్య అక్కడే ఉండి తన భర్తను రక్షించాలంటూ ఇరుగుపొరుగు వారికి వేడుకున్నప్పటికీ ఎవరు స్పందించలేదని, ఎవరైనా కాపాడి ఆసుపత్రికి తరలించి ఉంటే తన భర్త బ్రతికేవాడని ఆమె రోదిస్తూ తెలిపింది. తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఇవ్వలేకపోయామని
తనకు క్యాన్సర్ వచ్చిన దృష్ట్యా అప్పు చేయవలసి వచ్చిందని ఆమె రోదిస్తూ తెలిపింది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న రఘునాధ పళ్లి ఏ.ఎస్.పి భీమ్ శర్మ, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై సురేష్ లు సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. పోలీసుల కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు .

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి