Breaking News

మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు.

  • వాహనాలు నడుపుతూ పోలీసు తనికిల్లో పట్టుబడుతున్న మైనర్స్.
  • పిల్లలకు వాహనాలు ఇస్తే అజాగ్రత్తతో ప్రమాదాల బారిన పడతారు, ఇతరులను ప్రమాదాలకు గురి చేస్తారు.
  • తల్లిదండ్రులపై, వాహన యజమానులపై చర్యలు తప్పవు

నరసింహ ఐపిఎస్ ఎస్పి

మన ప్రగతి న్యూస్ సూర్యాపేట
జిల్లా స్టాపర్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ప్రకటించిన సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు అని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపిఎస్ కోరారు. మైనర్స్ కు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై, వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. గత కొద్ది రోజులుగా మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పోలీసు తనిఖీల్లో పట్టుబడుతున్నారు, పట్టుబడ్డవారికి జరిమానాలు విధిస్తూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాము అన్నారు, కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల వారు అజాగ్రత్తగా అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడతారు అలాగే ఇతరులకు ప్రమాదాన్ని కలగజేస్తారు కావున పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దని ఎస్పీ గారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు అన్నారు. రోడ్డు భద్రత చర్యలు ప్రతిఒక్కరూ పాటించాలి అని కోరారు. యువత అడ్డగోలుగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారినపడి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దుఃఖం పెట్టవద్దు అని కోరారు. పోలీసు జరిమానాలు విధించడం భద్రత చర్యల్లో భాగమని, మార్పుకోసమే అని తెలిపినారు, వాహనదారులు నిభందనలు ఉల్లంఘించి ఒక సారి జరిమానా కు గురైతే మళ్ళీ అలాంటి తప్పులు చేయవద్దు అని కోరారు.