Breaking News

మండల కేంద్రంలో కోతులు బాబోయ్ కోతులుమనషులపై ఎగబడి కరుస్తున్న కోతులుగత నెల రోజుల క్రితం సుమారు 20 మందిపై కోతులుదాడిపట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు…

మన ప్రగతి న్యూస్./నరసింహుల పేట

మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో తండాలలో కాలనీలో కోతుల బెడతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతుండంతో నడవాలంటేనే భయపడుతున్నారు. రోజంతా ఇళ్లలోనే తిష్టవేసి సరుకులు చిందర వందరగా పడేసి ఎత్తకుపోతున్నాయి. కోతులను బయటకు తరిమేందుకు ప్రయత్నిస్తే ఇంట్లో జనాలపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద రోజురోజుకూ తీవ్రంగా పెరగడంతో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రద్దీ ప్రదేశాల్లో సైతం కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు వద్ద కూడా కోతులు ఉంటుండటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు రోడ్ల పైకి రావాలంటే భయపడి బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇటీవల కోతులు దాడి చేయడంతో కొందరు ఆసుపత్రి పాలైన సంఘటనలు కూడా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి విముక్తి కలిగించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం