అచ్చంపేట ప్రిన్సిపాల్ ఏ రజిత
మన ప్రగతి న్యూస్ అచ్చంపేట
అచ్చంపేట పట్టణం అంబటిపల్లి బీసీ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఏ రజిత వైస్ ప్రిన్సిపల్ ముత్యాల వెంకటేష్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బీసీ గురుకుల కళాశాలల యందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని ఇందుకు ప్రస్తుతం పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ తమ యొక్క ఆసక్తికరమైన గ్రూపులలో ప్రవేశం పొందుటకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోగలరని ఇట్టి దరఖాస్తులకు ఏప్రిల్ 22 నుంచి మే 12వ తారీకు వరకు చివరి తేదీ అని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోగలరని పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలియజేయడం జరిగింది