Breaking News

జైలు నుండి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

దొంగతనాలను కట్టడి చేసేందుకు చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలునుండి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలని కమిషనర్‌ అధికారులకు పిలుపు నిచ్చారు. మార్చ్ నెల సంబంధించి నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ కమిషనరేట్‌ కార్యాలయములో నిర్వహించారు. వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన పోలీస్‌ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకోని, కేసుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లను పోలీస్‌ స్టేషన్‌ పిలిపించడం కాకుండా, అధికారులు రౌడీ షీటర్లను వ్యక్తిగతం కలుసుకోవడం లేదా పరిసరాల్లో వుందే వారి నుండి రౌడీ షీటర్‌ ప్రస్తుత స్థితిగతులను అరా తీయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో సిసి కెమెరాలు కీలకంగా నిలుస్తున్నాని, ఇందుకు గాను పోలీస్ స్టేషన్ పరిధిలో కెమెరా పనితీరుపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని.కొత్త సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, పోలీస్ స్టేషన్ ల్లో పని చేసే మహిళా సిబ్బందితో అన్ని రకాల విధుల్లో రాణించే విధంగా వారిని ప్రోత్సహించడంతోపాటు మహిళా సిబ్బందిలో స్టేషన్ అధికారులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని. జాతీయస్థాయిలో గుర్తింపు, అవార్డులు తీసుకొచ్చే విధంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ ఉండాలని, రేయి పగలు ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుందని పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే పోలీసు అధికారులకు రివార్డులు అవార్డులు ఉంటాయని పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు.
ఈ సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్‌, అంకిత్‌కుమార్‌, జనార్దన్, జనగాం ఏఎస్పీ చైతన్య, ఏ.ఎస్పీ మనాన్‌భట్‌, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు పాల్గోన్నారు.