Breaking News

మాయ మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని మోసం చేసిన దుండగులు

కేతేపల్లి ఎస్సై శివ తేజ గౌడ్

మన ప్రగతి న్యూస్ నల్గొండ/కేతేపల్లి
జిల్లా ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

కాసనగోడు గ్రామానికి చెందిన చెరుకు రోశయ్య, తండ్రి: లేట్ నర్సయ్య, వయస్సు: 48 సంవత్సరములు, కులం: మాదిగ, వృతి: కూలి, నివాసం: కాసనగోడు గ్రామం, కేతేపల్లి మండలo అను అతను మరియు అతని బంధువు అయిన చందుపట్ల వెంకటరమణ, తండ్రి: జానయ్య లేట్, వయస్సు: 49 సంవత్సరములు, కులం: మాదిగ, వృత్తి: కూలి, నివాసం: పిల్లలమర్రి గ్రామం, సూర్యాపేట మండలానికి చెందిన ఇద్దరు కలిసి తేది 19.10.2024 రోజున ఇనుపాములగ్రామానికి చెందిన మంద విజయ లక్ష్మీ భర్త: మంద కుమార్, వయస్సు: 28 సంవత్సరములు వృత్తి కూలి, అను ఆమెకి జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో అటెండర్ గా ఉద్యోగం ఇప్పిస్తా అని మాయ మాటలు చెప్పి తన దగ్గర మరియు తన బంధువు అయిన చింతమల్ల మమత ఇద్దరి దగ్గర రూపాయలు 20,000/-తీసుకొని వాళ్లని మోసం చేయగా ఉదయం వీరి ఇద్దరినీ కాసనగోడు గ్రామo లో అరెస్ట్ చేసి వీరి వద్ద 2 సెల్ ఫోన్ లు సీస్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనైనది. ఇలా మాయ మాటలు చెప్పి యువతిని మోసం చేసిన వాళ్లని కఠినంగా శిక్షిస్తామని కేతిపల్లి ఎస్సై శివతేజ గౌడ్ అన్నారు. మండలంలో ఎవరైనా ఇలా మోసం చేస్తే కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.