మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్:
మండల కేంద్రమైన ఏనుకూరులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె భర్త మరియు కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. రామ తండా గ్రామానికి చెందిన సోడియం బ్రహ్మ, ఆయన భార్య సంధ్య (38), కుమార్తె అమృతలు ద్విచక్ర వాహనంపై ఏనుకూరు ప్రధాన కేంద్రానికి వెళ్తుండగా, మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొన్నట్లు ఎస్ఐ రఫీ తెలిపారు.
ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108 సేవల ద్వారా బాధితులను ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా, సంధ్య మార్గమధ్యలో మృతి చెందినట్లు వెల్లడైంది. బ్రహ్మ మరియు అమృతల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్ఐ రఫీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.