మన ప్రగతి న్యూస్ /నర్సంపేట
నర్సంపేట పట్టణనికి చెందిన యువ యూట్యూబర్ కి దక్కిన అరుదైన గౌరవం చిన్న చిన్న రీల్స్ తీస్తూ ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన యూట్యూబర్ సమ్మెట శివమణికి ఇటీవలే సెప్టెంబర్ 7వ తేదీన యూనిటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా నుండి సిల్వర్ ప్లే బటన్ అవార్డుని కొరియర్ ద్వారా ప్రధానం చేశారు. అవార్డు పొందిన సమ్మెట శివమణి డిగ్రీ పూర్తి చేశాడు, తల్లి పేరు రజిత, తండ్రి పేరు స్వామి,వృత్తి క్షౌరశాలలో పనిచేస్తున్నాడు. శివమణికి చిన్నప్పటిను యూట్యూబర్ గా చేయాలనే మంచి సంకల్పంతో ఎంతోమంది హేళన చేసిన చిన్నచిన్న బిట్స్ ద్వారా కామెడీగా వీడియోలను స్వీకరించి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఎంతోమందిని నవ్విస్తూ మంచి పేరు తీసుకొచ్చారు. అదే తరుణంలో తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మిత్రుల సలహాలతో ఫోక్ సాంగ్ .. అల్లాహే అల్లా అనే పాటని చాలా అద్భుతంగా చిత్రీకరించి వేల లక్షలు మంది సబ్స్క్రైబర్స్ని తన యూట్యూబ్ ఛానల్ కి చేరి మంచి ఫలితం అందించరు. ప్రస్తుతం మరికొన్ని ఫోక్ సాంగ్ లకి చిత్రీకరిస్తున్న సమయంలో యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా నుండి యూట్యూబ్ అవార్డులు కైవసం చేసుకున్నాడు.ఇట్టి విషయం పై కాలనీవాసులు కుటుంబ సభ్యులు హర్షణయం వ్యక్తం చేస్తున్నారు. 1లక్ష సబ్స్క్రైబర్ క్రాస్ అయినా సందర్బంగా యూట్యూబ్ నుండి అవార్డు వచిందన్నారు. నియోజకవర్గం లో ప్రజలందరూ అండగా ఉండి ప్రోత్సహిస్తే మరింత గొప్ప స్థానం పొందుతామని శివమణి పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.

