Breaking News

రాష్ట స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక

మన ప్రగతి న్యూస్/ మల్లంపల్లి

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల్ బాడ్మింటన్ ఎంపిక పోటీలు జవహర్ లాల్ నెహ్రు స్టేడియం,హన్మకొండలో జరిగినవి. ఈ పోటీలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ఏటూరునాగారం (ఎట్) మల్లంపల్లి డి.దినేష్ 10వ తరగతి విద్యార్థి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అంకయ్య తెలిపారు.ఈ నెల13 నుండి 14 తేదీ వరకు జనగామ జిల్లాలోని కూనూరు లో జరిగే రాష్ట స్థాయి సబ్ జూనియర్ బాల్ బాడ్మింటన్ పోటీ లు జరుగునున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు పి.ప్రశాంత్ తెలిపారు.ఈ విద్యార్థిని అభినందన సభ కార్యక్రమంలో సినియర్ వైస్ ప్రిన్సిపాల్ వి.ప్రసన్న జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రహీం పాషా, శ్రీనివాస్, తదితర ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.

రామచంద్రం సేవలు చిరస్మరణీయంకొడకండ్ల ఏ ఎం సి మాజీ చైర్మన్ రాఘవరావు