మన ప్రగతి న్యూస్ /చౌటుప్పల్
చౌటుప్పల పట్టణ పరిధి తంగడపల్లి ముస్కు మధుసుధన్ రెడ్డి స్టేడియంలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పట్టణ కేంద్రంలోని అంజనా సాయి మెడోస్ లోగల కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. బుధవారం కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ గుత్త కవిత గోపాల్ రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు 17 సంవత్సరాల విభాగంలో కబడ్డీలో జీ సాక్షి చరణ్య బిధాత్రి నిఖిల్ చరణ్ తేజ,శశాంక్,అభిలాష్ వాలీబాల్ లో రాజశేఖర్,వరుణ్ 14 సంవత్సరాల విభాగంలో కబడ్డీలో ప్రదీప్,ప్రేమ్ కుమార్,శివమణి,అక్షిత వాలీబాల్ లో మోక్షిత్,గోపీచంద్, ప్రణయ్ కుమార్ జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ గుత్త కవిత గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్యంలోనే పిల్లలకు క్రీడల ఆసక్తి ఉండడం చేత మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పోటీ తత్వం అలవర్చుకొని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారని ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వీ రమేష్ వ్యాయామ ఉపాధ్యాయులు లింగస్వామి వి అనిల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

