ఫాసిస్ట్ శక్తులను నిలువరించడమే ఐలమ్మకు నివాళి
ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలి
సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా
సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గంలోప్రతినిధి:
వీర తెలంగాణ విప్లవోద్యమ చరిత్రను మతతత్వ శక్తులు వక్రీకరిస్తున్నాయని, చరిత్రను హైజాక్ చేసే పనిలో బూర్జువ పాలక పార్టీలు ఉన్నాయని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డిలు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయో
ధురాలు, వీరవనిత కామ్రేడ్ కమ్యూనిస్టు ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ, సిపిఎం పార్టీలు వేరువేరుగా అయిలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రమేష్ రాజా, రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కనకా రెడ్డిలు వేరువేరుగా మాట్లాడారు. వీర తెలంగాణ విప్లవోద్యమానికి నాంది పలికిన వీర వనిత ఐలమ్మ అని, ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం కొనసాగించాలని అన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా నీడన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్మించారని తెలిపారు. దొర నీ బాంచన్ కాల్మొక్త అనే రోజుల్లో దొరలకు వ్యతిరేకంగా ఐలమ్మ తిరుగుబాటు చేయడం స్ఫూర్తిదాయ
కమన్నారు. ఐలమ్మ కొనసాగించిన భూ పోరాటం భూ సంస్కరణలకు దారి తీసిందని, రాజకీయ ఎజెండాలో భూమి సమస్య ప్రధాన ఎజెండాగా నిలిచిందని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయని, 10 లక్షల ఎకరాలు భూమి ప్రజలకు పంచబడిందని, 4,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. నేడు మతోన్మాద శక్తులు వాస్తవ చరిత్రను మరుగున పడేస్తున్నారని, చరిత్రను మసిపోసి మారేడు కాయ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నిస్తుందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి సంబంధం లేని పాలకవర్గాల కుట్రలను కుతంత్రాలను ప్రజలు గమనించాలని కోరారు. మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందని దానిని నిలువరించడమే అమరవీరులకు నివాళి అని అన్నారు. సాయిధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులేనని ఇది జగమెరిగిన సత్యం అని ఆయన అన్నారు. అమరవీరుల త్యాగాలను ఎత్తిపెట్టాలని, వారి ఆశయ సాధన కోసం సమరశీల ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, ఈదునూరి మధార్, ఇంద్రారెడ్డి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనంతోజు రజిత, జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శి కొనకటి కళింగరాజు, గాయాల బాబు, రాజు, తూర్పాటి సారయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

