Breaking News

దళిత వీర్ అవార్డు అందుకున్న శ్రవణ్ కుమార్ గట్టు

మన ప్రగతి న్యూస్ / రామన్నపేట:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో సిపిఎం పార్టీ ఆఫీస్ జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన చుండూరు దళిత వీరుడు కొమ్మర్ల అనిల్ కుమార్ 34వ వర్ధంతి సందర్భంగా పల్లవి వీరుల మహోత్సవం లో భాగంగా రాష్ట్ర సదస్సు దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాసన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని జాతీయ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ అధ్యక్షత వహించగా, జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్య రావు మరియు జాతీయ కార్యదర్శి పి శంకర్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ మరియు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ భావజాలం సామాజిక బాధ్యతతో దళిత బహుజన వర్గాల కోసం పనిచేస్తున్న పలువురికి దళిత వీర అవార్డులను ప్రధానం చేయగా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన గట్టు శ్రవణ్ కుమార్ కు గత 20 సంవత్సరాలుగా అంబేద్కర్ భావజాలంతో దళిత బహుజనుల కోసం చేస్తున్న కృషిని గుర్తించి దళిత వీర్ అవార్డును మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ నెంబర్ జిల్లా శంకర్, రాంబాబు నాయక్ వివిధ జిల్లాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు