Breaking News

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదలకు వరం 

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

కళ్యాణ లక్ష్మి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదలకు
ఒక వరమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని అర్హులైన పేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లల వివాహాలు చేసిన కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కుటుంబ పెద్దగా పెద్దన్న పాత్ర పోషిస్తూ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తుందని తెలిపారు. ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పాలకుర్తి మండలం లో అర్హులైన పేదలకు 56 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించా
మన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నియోజకవర్గానికి 35 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని మొదటి విడతలో అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేశామని రెండో విడతలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని ఎవరు నిరాశ పడదని అన్నారు. రాష్ట్రం ఆర్థిక భారం లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కిందన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. సంక్షేమ పథకాలను పొందుతున్న లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జలగం కుమార్, మాజీ ఎంపీటీసీ బొమ్మగాని మానస భాస్కర్ గౌడ్, పాలకుర్తి సహకార బ్యాంకు మాజీ చైర్మన్లు అడ్డూరి రవీందర్ రావు, వీరమనేని యాకంతారావు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, ఓబిసి రాష్ట్ర నాయకులు పులి గణేష్ గౌడ్, నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్, మారం శ్రీనివాస్, బైరు భార్గవ్,ఎండి మదర్, పోగు శ్రీనివాస్, పెనుగొండ రమేష్, కామారపు సునీల్, కోలా వేణు గౌడ్, గోనె మహేందర్ రెడ్డి, ఎండి నజీర్, బానోతు కిషన్ నాయక్, బండపల్లి వెంకన్న గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.