Breaking News

సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

సైబర్ పోలీసు వారియర్స్ తో సమావేశం నిర్వహించిన జిల్లా బుధవారం వారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్టేషన్లలో పనిచేస్తున్న సైబర్ పోలీసు వారియర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించి సైబర్ నేరాలును నివారించడం, చేదించడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం సైబర్ పోలీసు వారియర్స్ కు టీ షర్టులు అందజేశారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ….. సైబర్ వారియర్స్ గా చేస్తున్న వారి అనుభవాలు పనితీరు గురించి తెలుసుకున్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలకు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం కావున సైబర్ వారియర్స్ రెగ్యులర్గా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. అలాగే జిల్లా సైబర్ సెల్ తో సమన్వయం తో పని చేస్తూ సోషల్ మీడియాలో అనుమాదస్పద కంటెంట్ పై నిఘా ఉంచడం, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటలిజెన్స్ సేకరణ వంటి
బాధ్యతలను కూడా సమర్ధవంతంగా చేయాలి. సైబర్ వారియర్స్ తమ బాధ్యతను నైతికంగా, చట్టబద్ధంగా నిర్వహించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్భి డిఎస్పి, మహేశ్వరరావు, సైబర్ క్రైమ్ ఎస్సై, రవి ప్రకాష్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి, మరియు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.