Breaking News

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూరు:-

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని గార్ల గుట్ట కాలనీకి చెందిన షేక్ కరీం (21) వాళ్ల తల్లి షేక్ నయమ సుల్తాన్ తో కలిసి ఉండేవారు. మంగళవారం రోజు రాత్రి ఇంట్లో భోజనం చేసి పడుకున్న తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంట్లో వంట గదిలో సిమెంటు రేకులకున్న ఐరన్ కడ్డీతో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్టి విషయంపై మృతిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని ఇట్టి కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని ఆత్మకూర్ సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు