మన ప్రగతి న్యూస్ / దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం నాచారం, సీతారాంపురం గ్రామపంచాయతీలలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం ఉదయం హలో శుభోదయం కార్యక్రమం నిర్వహించి, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వ్యక్తిగత గ్రామాభివృద్ధి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పలువురిని పరామర్శించి, మెరుగైన వైద్యం కోసం తనని సంప్రదించాలని అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పలు కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు. నాచారం గ్రామంలో ఎర్రగొర్ల రాధాకృష్ణ చిన్నమ్మ నాగరత్నమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మంచినీటి ట్యాంకర్ ను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయగా దానిని ప్రారంభించి వారి కుటుంబాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్, సొసైటీ చైర్మన్ యెళ్లిన రాఘవరావు, గ్రామ శాఖ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, జల్లిపల్లి కిషోర్, ఎర్రగొర్ల రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

