Breaking News

మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం

నిందితునికి 21 ఏళ్ల జైలు జరిమాన

గడిచిన సంవత్సర కాలంగా పోక్సో యాక్ట్ క్రింద 17 కేసులలో 18 మంది

నిందితులకు జైలు జరిమాన

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

మన ప్రగతి న్యూస్ నల్గొండ/కట్టంగూర్

కట్టంగూర్ మండలం దూగినవెల్లి గ్రామానికి చెందిన జడిగిల హరీష్ తండ్రి ఆంజనేయులు ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించించి మోసం చేసిన ఘటనలో బాధితురాలు తేది 23-07-2018 నాడు ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితుడి పై కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్ సీట్ దాఖలు చేయగా నేడు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక సంవత్సరం జైలు 5000 రూపాయల జరిమానా మొత్తం కలిపి 21 సంవత్సరాల జైలు 30 వేల రూపాయల జరిమాన
బాధితురాలికి రూ.5 లక్షల రూపాయల పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా పోక్సో యాక్ట్ 17 కేసులలో 18 మంది నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష జరిమాన విధించడం జరిగిందని ఎవరైనా మైనర్ బాలికలపై ఆత్యాచారాలకు పాల్పడితే ఎప్పటికైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ఈ కేసులో సరి అయిన సాక్ష్యదారలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐలు క్యాస్ట్రో రెడ్డి, యస్.ఐ రంజిత్ కుమార్, అలాగే ప్రాసెక్యూషన్ కు సహకరించిన కె.శివరాం రెడ్డి, నల్గొండ డీఎస్సీ శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి, కట్టంగూర్ యస్.ఐ రవీందర్,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సి డి ఓ రువ్వా నాగరాజు, లైజన్ అధికారులు,లీగల్ ఆఫీసర్ బరోసా సెంటర్ కె.కల్పన, పి.నరేందర్, యన్ మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.