మన ప్రగతి న్యూస్/ కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పోలీస్ స్టేషన్లో ఎసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్వో సురేష్ కుమార్ ఎంపీడీవో గుండె బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామాల్లోని యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని దానివల్ల యువత ఆరోగ్యం క్షీణించడమే కాకుండా వారి కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా, కుంటుపడుతున్నాయని అన్నారు. కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు . డ్రగ్స్ అలవాటుపడ్డ యువత సమాజంలో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, చేయడానికి వెనకాడరని వారి బంగారు భవిష్యత్తు చేజేతులా నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా యువత మేల్కొని డ్రగ్స్ బారిన పడకుండా మత్తు ఇంజక్షన్లకు బానిస కాకుండా ఉండాలని ఎవరైనా డ్రగ్స్ సేవించడం కానీ మత్తు ఇంజక్షన్లు మెడికల్ షాపులో కొనుగోలు చేయడం కానీ చేసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. రిజిస్టర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప మెడికల్ షాప్ వారు ఆ వ్యక్తికి మందులు ఇవ్వాలి తప్ప ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేని వారికి మందులు ఇస్తే వారి మెడికల్ లైసెన్స్ సీజ్ చేయించి మెడికల్ షాప్ ను ముయిస్తామని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ ఎక్కువైనందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ మెసేజెస్ తెలియని నెంబర్లనుండి ఫోన్ కాల్స్ వస్తే స్పందించకూడదని వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ హరికృష్ణ, ఎస్సై వీరభద్రరావు, ఎస్సై మధు, పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.

