Breaking News

అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి

సమాజ సేవలో ప్రజల హృదయాలలో ఒక స్థానం సంపాదించుకున్న అఖిలపక్ష ఐక్య వైదిక అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ డాక్టర్ సతీష్ యాదవ్ కు కొత్తకోట మాజీ మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిణి విశ్వశ్వర్ నివాసంలో కొత్తకోట మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వేశ్వర్ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వశ్వర్ మాట్లాడుతూ.. వనపర్తికి చెందిన మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులు కోల్పోయి కడుదయనీయ స్థితిలో ఉన్న నిరుపేద అనాధ కుటుంబాలకు చెందిన 42మంది విద్యార్థులకు చదువు చెప్పించి..ఆశ్రయం కల్పించినందుకు కృష్ణాష్టమి రోజు పాండిచ్చేరిలో డాక్టరేటు అవార్డు పొందడం అభినందనీయమని అన్నారు.అదే సందర్భంలో విజయవాడలో గిడుగు రామ్మూర్తి అవార్డు సాధించి వనపర్తి జిల్లాకు పేరు తీసుకురావడం పట్ల ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, మాజీ ఎం.పీ.టీ.సీ సత్యం యాదవ్,మాజీ కౌన్సిలర్లు ఖాజా మైనద్దీన్,రాములు,మాజీ కో అప్షన్ సభ్యులు షేక్ తహసీన్ వహీద్ అలీ,మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎల్ఐసి కృష్ణయ్య, ఆల్ ఆలన్న సోషల్ మీడియా వారియర్ వినోద్ సాగర్,లక్ష్మన్న గారి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేములవాడలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి