Breaking News

హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్

వివాహేతరసంబంధమేహత్యాయత్నం కు కారణాం

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి:

వేములవాడలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో 15 రోజుల క్రితం తన పైన వడ్డే బాబు అనే వ్యక్తి తన ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడని తీగుల బాలచంద్రం అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జగదేవపూర్ పోలీసులు. ఇట్టి విషయంలో విచారణ చేపట్టిన పోలీసులు వడ్డే బాబును పట్టుకొని విచారించగా కీలక విషయాలు చెప్పినాడు. బాబుకు, బాలచంద్రం భార్య అయిన మమతకు గత సంవత్సర కాలంగా వివాహేతర బంధం ఉంది. ఇట్టి సంబంధం గురించి తెలిసిన బాలచంద్రం, మమత యొక్క సోదరులైన మహేష్, లక్ష్మణులు రెండుసార్లు బాబును, మమతను మందలించారు. దాంతో వీరు ఇరువురికి కలుసుకోవడం కష్టం కావడంతో బాలచంద్రాన్ని చంపివేస్తేనే తాము స్వేచ్ఛగా తిరగవచ్చు అన్న ఆలోచన తో గత ఆగస్టు నెల 24వ తారీఖు నాడు రాత్రి పూట బాలచంద్రం పడుకున్న తర్వాత మమత బాబుకి ఫోన్ చేసి నేను ఇంటి యొక్క తలుపు తీశాను నువ్వు వచ్చి చంపెయ్ అని చెప్పగా బాబు ఐరన్ రాడు, కూరగాయలు కోసే కత్తిని తీసుకుని వెళ్లి బాలచంద్రం మేడ వీపు చేతి తలపైన గాయాలు చేసినాడు. చనిపోయాడు అనుకుని వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఈరోజు పట్టుకొని విచారించగా మమతనే తన భర్తను చంపమని ప్రోత్సహించింది అని తెలుపగా మమతను కూడా అదుపులోకి తీసుకొని ఇరువురిని జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం గజ్వేల్ కోర్టులో హాజరు పరిచిన జగదేవపూర్ పోలీసులు.