మనప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:-
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర వీఆర్‌ఆర్ వెంచర్‌లో దాదాపు 120 చెట్లను అర్ధాంతరంగా నరికివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు రెండు చెట్లు నాటాలని, 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ అధికారులు ప్రజలకు సూచనలు చేస్తూ ఉన్న సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంద్రసేనారెడ్డి అక్కడికి చేరుకొని చెట్ల నరికివేత జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.పర్యావరణ పరిరక్షణకు విరుద్ధంగా జరుగుతున్న ఈ చర్యపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

