Breaking News

రైతు వేదికలను పరిశీలించినజిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్

మన ప్రగతి న్యూస్/నర్సింహులపేట

మండల కేంద్రంతో పాటు పెద్ద
నరసింహులపేట మండల కేంద్రంతో పాటు పెదనాగరం రైతు వేదికలను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు .ఈ సందర్భంగా కూపన్లు జారీ చేస్తున్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడుతూ త్వరలో అధిక సంఖ్యలో యూరియా బస్తాలు రానున్నాయని రైతులు అధైర్య పడద్దని తెలిపారు. క్యూలైన్లో నిలబడ్డ ప్రతి రైతుకు కూపన్లు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు
మహబూబాబాద్ జిల్లాలో ఎరువుల పంపిణీ ప్రక్రియలో పోలీసుల కీలక సహకారం లభించింది. రైతులు ఊపిరి పీల్చుకునేలా, యూరియా బస్తాలను సమర్థవంతంగా మరియు భద్రంగా పంపిణీ చేయడానికి జిల్లా పోలీసులు ముందడుగు వేశారు.
వివిధ రైతు సమితులు మరియు సభ్యులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పారదర్శకంగా యూరియా ఎరువులు అందజేయబడ్డాయి. ఈ సందర్భంగా రైతులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ, పోలీసుల సహకారం వల్ల తాము నిశ్చింతగా ఎరువులు అందుకున్నామని తెలిపారు.
మహబూబాబాద్ పోలీసు విభాగం, రైతుల సమస్యలను అర్థం చేసుకుని సమయానుకూల చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, తొర్రూర్ సిఐ గణేష్, స్థానిక ఎస్సై మాలోత్ సురేష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు