-భూధాన్ జయంతి వజ్రోత్సవాలకు
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
భూదానోద్యమానికి నాంది పలికి ,పట్టుచీరల తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లికి రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకువచ్చే బాధ్యత నాదని భువ నగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భూదానోద్యమ పితామహుడు ఆచార్య వినోబా భావే 130 వ జయంతోత్సవం గురువారం నాడు యాదాద్రి భు వనగిరి జిల్లా- భూదాన్ పోచంపల్లి లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ఎంపీ బోనగిరి ఎమ్మెల్యే తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగావినోబాభావే, భూదాత వెదిరే రామచంద్ర రెడ్డిల విగ్రహాలకు పూలమాలలు వేసి ,నివాళులు అ ర్పించారు. భూదాన్ స్తూపం వద్ద పుష్పాలు చల్లి ప్రణమిల్లారు.వినోబా ఆశ్రమంలో భూదానోద్యమ ఘట్టం కు సంబంధించిన చిత్రాలను తిలకించారు.అనంతరం గ్రా మీణ పర్యాటక కేంద్రం ఆవరణలో ప్రొఫెసర్ తడక యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ సీఎం రాకకు అనుకూల వాతావరణం, సన్నివే శం ఏర్పాటు చేసుకోవాలన్నారు .వచ్చే ఏప్రిల్ 18న సీఎంను ఇక్కడికి బాధ్యతతో తీసుకువస్తానన్నారు.100 ఎకరాల భూమిని దానమిచ్చిన రామచంద్రారెడ్డిని స్మ రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోచంపల్లి ఇంకా అభివృద్ధి చెందాలని ఎ క్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడి చేనేత ఇక్కత్ చీరలను ప్రిం టింగ్ చేయడాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తానన్నారు . భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూధాన్ భూములు అక్రమార్జనకు గురికాకుం డా ఉంటే పేదోనికి భూమి చెందుతుండేదని, ప్రజా ప్రయోజనాలకు వాడబడు తుండేదన్నారు. భూదాన్ బోర్డు , ఏర్పాటుకు వచ్చే ఏప్రిల్ 18న సీఎంను ఇక్కడికి తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో వినోబ సేవా సం స్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తంలో భూదానం గూర్చి చరిత్రలో పేజీ ఉన్న గ్రామం పోచంపల్లి అన్నారు .ఈ గ్రామం భూధాన్ గంగో త్రి అని ,వినోబా భావే తన రెండవ జన్మస్థలంగా ప్రకటించాడన్నారు .భూదాన్ బో ర్డు ఉండాలని, బోర్డు ఏర్పాటుకు ఎంపీ ,ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలన్నారు. నా డు వినోబా భావే వెలిగించిన దీపం వల్లనే ఎంతోమంది పేద ప్రజలకు జీవన భుక్తి కై భూమి దానంగా లభించడం జరిగిందన్నారు.పద్మశాలి మహాజన సంఘం అధ్య క్షుడు సీత శ్రీరాములు మాట్లాడుతూ ఇక్కడ కులవృత్తులను ప్రభుత్వం ఆదుకుం టేనే పూర్వ వైభవం వస్తదన్నారు.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటేష్ మాట్లా డుతూ ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.స్థానిక వి నోబా ఆశ్రమం ప్రారంభోత్సవానికి సీఎంను తీసుకురావాలని కోరడం జరిగింది .ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించి ,పదవి విరమణ పొందిన రాచకొండ సత్తయ్యను సన్మానించారు.ఈ కార్యక్రమానికి స్థానిక పట్టుచీరల ఉత్ప త్తిదారుల సంఘం అధ్యక్షుడు భారత లవ కుమార్ వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సామ మధుసూదన్ రెడ్డి, కళ్లెం రాఘవరెడ్డి ,పాక మల్లేష్ యాదవ్ ,అంబరీష్ రెడ్డి ,తడక రమేష్ తో పాటు ఏలే బిక్షపతి, కొయ్యడ నరసింహ, వేషాల మురళి తదితరులు పాల్గొన్నారు.

