Breaking News

ఎంపీపీఎస్ పాఠశాలలో స్పోర్ట్స్ యూనిఫాం పంపిణీ

మన ప్రగతి న్యూస్ /గజ్వేల్ డివిజన్ ప్రతినిధి:

సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం చిన్న కిస్టాపూర్ గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం స్పోర్ట్స్ యూనిఫాం పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా గ్రామస్థులు,వివిధ సంఘాల ప్రతినిధులు, కుకునూరుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,శ్రీకాంత్ రెడ్డి,తదితరులు ఆర్థిక సహకారం అందించారు.ఈ సందర్భంగా స్పోర్ట్స్ యూనిఫాం దాతలను ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. అలాగే పాఠశాల అభివృద్ధికి విశేష సహకారం అందించిన పంజాల ప్రశాంత్ గౌడ్‌ ను కూడా శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్య ను అంగీకరించి ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి సి.ఎం.ఓ. శ్రీ రంగనాథ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ చెన్న శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి అశోక్,సుధారాణి, వెంకటేశం,రేఖ,గ్రామస్థులు రాజు గౌడ్, నందన్ గౌడ్,చంద్రం, తదితరులు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు