- బీసీల జపం చేస్తున్నఅగ్రవర్ణ రాజకీయ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దు
- జక్కే వీరస్వామిగౌడ్ పిలుపు
మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్
ఈ నెల 14 వ తేదీన కరీంనగర్ లోని పద్మశాలి భవన్ లో బీసీ ఇoటలక్చవల్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరుగబోవు బీసీ మేధావుల సభను విజయవంతం చేయాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ పిలుపునిచ్చారు.జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు ఇప్పుడున్న ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం కొంగ జపాలు చేస్తున్నాయని ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అన్యాయం చేసిన పార్టీలే అని వీరస్వామిగౌడ్ మండి పడ్డారు.బీసీ మేధావులైన రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ అలాగే ఇంకా చాలా మంది బీసీ మేధావులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిసిఐఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి హాజరై రిజర్వేషన్ల సాధన ప్రభుత్వ పాలనలో బీసీల వాట అనే అంశం పై దశ నిర్దేశం చేయనున్నారని ఈ యొక్క సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీసీ కుల సంఘాలు ముఖ్యoగా హుజురాబాద్ నియోజికవర్గం లోని యువత విద్యార్థి నాయకులు బీసీ సోదర సోదరీమణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.బీసీలలో ఉన్న కొందరు నాయకులు ఈ అగ్రవర్ణ పార్టీలకు వాళ్ళ స్వార్థం కొరకు ఎన్నికలు రాగానే చెంచాలుగా మారి మొత్తం బీసీ సమాజాన్ని తాకట్టు పెట్టి పబ్బం గడుపుతుంటారని అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మన ఓట్లు మన స్వతంత్ర బీసీలకు వేసి రాజ్యాధికార దిశగా బీసీ సమాజం అడుగులు వేయాలని వీరస్వామిగౌడ్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తా అని దొంగ నాటకాలకు తెరలేపిందని బీజేపీ మతపరమైన రిజర్వేషన్ తో తొండి నాటకాలు అడుతోందని ముస్లింలలో కొన్ని కులాలు బీసీల లో ఉన్న విషయం తెలిసి మత రాజకీయాలు చేస్తోందని బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రలో భాగమే బీజేపీ నాటకం అని అలాగే స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్ 23 శాతానికి తగ్గించిన ఘనత గత కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీదని ఇప్పటికైనా బీసీలు ఈ పార్టీల కుట్రలను పసి గట్టాలని లేక పోతే బీసీలు మరోసారి మోసపోయే ప్రమాదం ఉందని అందుకే బీసీలు కులవృత్తుల ద్వారా కులాలు వేరైనా బీసీలమనే విషయాన్ని గుర్తించాలని వీరస్వామిగౌడ్ అన్నారు.ఈ సమావేశంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులు పొన్నం భిక్షపతి గౌడ్, జే కిరణ్, గణపతి రాజ్,కేనారాయణ,జక్కే.రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

