Breaking News

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతగా ఎదగాలి

డీఎస్పీ శివరాం రెడ్డి

మన ప్రగతి న్యూస్ /నల్గొండ జిల్లా ప్రతినిధి

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్

విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివి ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందాలని నల్లగొండ డీఎస్పీ సూచించారు. ఆదివారం పట్టణంలోని ఎన్.ఆర్. ఎస్ గార్డెన్స్ లో నిర్వహించిన ఫ్రెషర్స డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువుతో పోరాటం చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు.ఇంటర్మీడియట్ దశ జీవితాలను మార్చివేస్తుందని,ఆలోచనను గమనించి విద్యార్థులు కష్టపడాలని అన్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.అనంతరం వివిధ విభాగాలలో ఉత్తమంగా రాణించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ జూనియర్ కళాశాల, పాఠశాల జోనల్ ఇంచార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ జోనల్ సతీష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ మనోజ్ రెడ్డి, ఎస్ ఆర్ ప్రైమ్ స్కూల్ ప్రిన్సిపల్ రూప, డీన్ కిషోర్ పాల్గొన్నారు.