Breaking News

స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ఎస్ ఎన్ ఎస్ పి 2025

డాక్టర్ సంజయ్ పాములపాడు పి హెచ్ సి

మన ప్రగతి న్యూస్ నల్గొండ/మాడుగులపల్లి

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం, ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ఎస్ ఎన్ ఎస్ పి 2025 అను జాతీయ కార్యక్రమం తేదీ 17 సెప్టెంబర్ రోజున దేశవ్యాప్తంగా భారత ప్రధాన మంత్రి చేతుల మీదుగా, ఇండోర్, మధ్యప్రదేశ్, నందు ప్రారంభించబడుతుంది .ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 17-09-2025 నుండి: 02-10-2015 -గాంధీ జయంతి రోజు వరకు నిర్వహిస్తారు 16 రోజులు
మహిళలకు పిల్లలకు సమగ్ర ఆరోగ్యసేవలు, పోషకాహారం మరియు వాటి మీద అవగాహన కల్పించడం ద్వారా వాళ్ల కుటుంబాల సాధికారత తద్వారా సమాజం యొక్క సాధికారత సాధించటం సాధ్యమవుతుంది. తద్వారా జాతీయ పురోగతి మరియు దేశవ్యాప్తంగా ఆరోగ్య ఫలితాలు మెరుగుపరచడం సాధ్యమవుతుందని భావించి శక్తివంతమైన ఈ అభియాన్ కార్యక్రమాన్ని వ్యూహత్మాకంగా రూపొందించబడింది.ఈ కార్యక్రమం, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించే పోషణ్ మాః కార్యక్రమంతో సమన్వయించబడుతుంది.
దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో వున్న ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో, ఏరియా ఆసుపత్రులు మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్య శిభీరాలు నిర్వహించి,మహిళలకు పిల్లలకు కౌమర బాలబాలికలకు సమగ్ర స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 3500 స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహించుటకు ప్రణాళిక సిద్ధం చేసారు.17-09-2025 రోజున దేశవ్యప్త ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లాకి ఒక మెగా క్యాంప్ చొప్పున తెలంగాణ రాష్ట్రావ్యాప్తంగా మొత్తం 33 మెగా క్యాంపులు నిర్వహించుటకు ప్రణాళిక సిద్ధం చేసారు. వైద్య శాఖ, మరియు అన్ని ప్రభుత్వ శాఖల సమగ్ర నాయకత్వంలో, ప్రజల మద్దతుతో ఈ అభియాన్ ఒక నిజమైన ప్రజా ఉద్యమంగా విజయవంతం చేస్తారని డాక్టర్ తెలియజేశారు.