డాక్టర్ సంజయ్ పాములపాడు ఆరోగ్య కేంద్రం
మన ప్రగతి న్యూస్ నల్గొండ/మాడుగులపల్లి
మాడుగుల పల్లి మండల పాములపాడు గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్తినారి స్వశక్తి పరివార్ అభియాన్ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో భాగంగా స్త్రీలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ గురించి మౌతు క్యాన్సర్, వివిధ రకాల వ్యాధుల గురించి స్త్రీలకు ప్రత్యేక అవగాహన వాటిపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.స్పెషలిస్ట్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కళింగవరెడ్డి, హరికృష్ణ రెడ్డి మరియు రావు. వెంకట్ రెడ్డి ముఖ్యఅధితులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు సిహెచ్ వనిత .గైనకాలజిస్ట్, డాక్టర్ ఎస్ ఎస్ సంజయ్ కుమార్, డాక్టర్ సత్యనారాయణ మరియు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు వైద్యసిబ్బంది.

