Breaking News

అంగరంగ వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని గంగపుత్ర వీధిలో బొడ్డెమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా మహిళలంతా కలిసి జరుపుకున్నారు. బతుకమ్మ పాటలతో కోలాటం ఆడుతూ ఘనంగా జరుపుకున్నారు. తమ కుటుంబాలు, ప్రజలు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి సంతోషంగా ముఖ్యంగా యువతులు తమకు మంచి తోడు దొరకాలని తమ జీవితం సుఖ సంతోషాలతో వెలగాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా గంగపుత్ర మహిళ అధ్యక్షురాలు గుంటి రమ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన సాంప్రదాయాన్ని మన ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై , ముఖ్యంగా మహిళలపై ఉందని అన్నారు. తొమ్మిది రోజులు ఎంతో ఆర్భాటంగా ఉత్సాహంగా బొడ్డెమ్మ వేడుకలను నిర్వహించుకుంటామని 9వ రోజు చెరువులో నిమజ్జనం చేస్తామని అనంతరం బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. ముఖ్యంగా యువతులు బొడ్డెమ్మ వేడుకలో అధిక సంఖ్యలో పాల్గొనాలని అది వారికి మంచి జరుగుతుందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించుకుంటున్నామని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల రేఖ, మేధరబోయిన శైలజ, తుంగతుర్తి సునీత, అంబటి రజని, అనుమాండ్ల అనురాధ, లక్ష్మి, రుద్ర, అమూల్య, దీప, సంధ్య, గౌతమి, సత్య, మాధవి, రవళి,అనూష,అర్చన, సరళ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్