బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో భారీ వర్షాల పరిస్థితిపై అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష

గురువారం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు

మన ప్రగతి న్యూస్/హనుమకొండ:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిపై జిల్లా అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలోని వర్ష ప్రభావం స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వర్ష ప్రభావం, పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఎడతెరిపి లేకుండా మరిన్ని రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు విధినిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నందున పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.