బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

మెరుగైన వైద్య సేవల కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి..

1 కోటి 50 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో 15 రకాల వైద్య పరికరాలను అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిని విస్మరించింది..

జమ్మికుంట ఆసుపత్రిలో అనేక సమస్యలున్నాయి…

జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి అవసరమైన వైద్యులను వెంటనే నియమించాలి..

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్

జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పనిచేస్తున్నారని , ఆ దిశగా రూ.1 కోటి 50 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో 15 రకాల విలువైన వైద్య పరికరాలు సామాగ్రిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అందించారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిఎస్ఆర్ నిధులతో వైద్య పరికరాలను అందజేసిన నేపథ్యంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, జిల్లా ఓబీసీ మోర్చ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మరియు స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రి స్థితిగతులను గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జమ్మికుంట ప్రాంతంలో పేద , మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సమస్యలకు పెద్ద దిక్కుగా ఉన్న జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు అనేక సమస్యలతోకొట్టుమిట్టాడుతుందన్నారు. ఆసుపత్రిలో వివిధ విభాగాల కు అవసరమైన వైద్యుల కొరత ఇక్కడ తీవ్రంగా ఉందన్నారు. సరైన మందులు, ఆరోగ్య పరీక్షలు కూడా లభించలేని స్థితిలో జమ్మికుంట ప్రభుత్వాసుపత్రి ఉందన్నారు. ఇక్కడి ఆసుపత్రిలో అవసరమైన వైద్య సేవలు లభించకపోవడంతో జమ్మికుంట ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక్కడి ప్రాంత ఆస్పత్రి సమస్యలను తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట ఆసుపత్రి కి అవసరమైన వైద్య పరికరాల కొరతను తీర్చాలనే ఉద్దేశంతో, పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య అవసరాల కోసం వినియోగించే విలువైన 15 రకాల వైద్య పరికరాలను అందించారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని , ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రధానంగా జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిలో వివిధ విభాగాల్లో పని చేసే వైద్యుల కొరత తీవ్రంగా ఉందని , వెంటనే ఆ సమస్యను పరిష్కరించడానికి , ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు రమణా రెడ్డి, బచ్చు శివకుమార్, కైలాసకొటి గణేష్, రాజేష్ ఠాకుర్, తిరుపతి రెడ్డి, రాకేష్ ఠాకూర్, బల్సుకూరి రాజేష్, రాచపల్లి ప్రశాంత్, రామ రెడ్డి, కేస స్వరూప, ముకుందా సుధాకర్, అప్పాల రవిందర్, ఆకుల తిరుపతి, యాంసాని సమ్మయ్య, చందా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.