Breaking News

వర్ష ప్రభావిత వరి పంటల ను పరిశీలన

వర్ష ప్రభావిత వరి పంట పరిశీలన రైతులకు సూచనలు చేసిన వ్యవసాయ అధికారి ఏ. నరసింహారావు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

మొంతా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏన్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. గురువారం మండల వ్యవసాయ అధికారి ఏ. నరసింహారావు అరికాయలపాడు గ్రామంలో నీట మునిగిన వరి పొలాలను సందర్శించి పరామర్శించారు.ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ నీట మునిగిన పంటలను సకాలంలో రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే గణనీయంగా నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. పొలం మడులలో నీరు నిల్వ ఉండకుండా గండ్లు పెట్టి బయటకు వెళ్లేలా చూడాలని, వర్షం ప్రభావంతో నేలవాలిన వరి కంకులు నీటిలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం తగ్గిన వెంటనే కిందపడిన వరిని కట్టలుగా కట్టి ఎండలో ఆరబెట్టాలని, తెగుళ్ల నివారణకు లీటర్ నీటికి ఒక గ్రాము కార్బెండాజిం పిచికారీ చేయాలని సూచించారు. అలాగే బ్యాక్టీరియా, ఎండాకు, మాగుడు తెగుళ్ల నియంత్రణకు ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రాపికోనజోల్ చల్లాలని తెలిపారు. కోతకు సిద్ధమైన పంటలపై లీటర్ నీటిలో 5 శాతం ఉప్పు ద్రావణం కలిపి పిచికారీ చేయడం వల్ల ధాన్య రంగు మారకుండా ఉంటుందని వివరించారు.రైతులు తమ పంట నష్టంపై ఆవేదన వ్యక్తం చేయగా, నష్టపోయిన పంటలపై పరిశీలనలు జరిపి అంచనాలు సిద్ధం చేస్తామని వ్యవసాయ అధికారి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కె. కమలాకర్, గ్రామ పాలనాధికారి మౌలా సాహెబ్, రైతులు బట్టు హనుమంతు రెడ్డి, లేళ్ళ వెంకటేశ్వర్లు, దొంతేబోయిన నాగరాజు, ఎర్రగాని రమేష్, లేళ్ళ తిరుపతి స్వామి, లేళ్ళ స్వామి, మోదుగు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.