Breaking News

కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి ఉద్యోగులకు సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన…

కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల ప్రకారం….

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైబర్ క్రైమ్ డిఎస్పి బి అశోక్ కుమార్ చే సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ని కార్యాలయ సిబ్బంది అధికారులకు పై విషయాలపై అవగాహన సదస్సు కల్పించుటకు సమావేశ కార్యక్రమం నిర్వహించుటకు అనుమతి కోరడమైనది వారి అభ్యర్థన మేరకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఆదేశానుసారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ అధికారులకు మరియు ఉద్యోగులకు గురువారంన సైబర్ క్రైమ్ మరియు మత్తు పదార్థాల నియంత్రణ కొరకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా సైబర్ క్రైమ్ డిఎస్పి బి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు వృద్ధి చెందుతున్నాయని 2022లో 10.29 లక్షలు ఉన్న సైబర్‌ క్రైమ్ ఘటనలు 2024లో 22.68 లక్షలకు చేరుకున్నాయని నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో వచ్చిన ఫైనాన్షియల్‌ ఫ్రాడ్స్‌ ద్వారా రూపాయలు36.45 లక్షలు మోసపోయినట్లు నమోదు అయ్యాయని ఈ నేరాల నివారణ కొరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన “ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4 సి)” అనేక చర్యలు చేపడుతోందని ఇందులో భాగంగా 24,600 మంది పోలీస్ సిబ్బందికి ట్రైనింగ్ అందించబడిందని అలాగే 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ అకౌంట్లు బ్లాక్ చేయబడ్డాయని. సైబర్ ఫ్రాడ్‌లపై ప్రజలకు సత్వర సహాయం కల్పించేందుకు 1930 హెల్ప్‌లైన్ నంబరుఅందుబాటులో ఉందని అన్నారు.డ్రగ్స్ విషయంలో, 2025లో ఇప్పటి వరకూ 88 కేసుల్లో రూ.5.79 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోగా, 107 మందిని అరెస్టు చేశారని గత ఏడాదితో పోల్చితే ఇది 59% అధికం అని ఈ నేరాల నివారణ కోసం ఎన్సీబీతో పాటు ఇతర సంస్థలతో కలిసి రైళ్లలో తనిఖీలు మరింత కఠినతరం చేశారని, డ్రగ్స్ వినియోగం యువత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోందని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం చేసిన వారికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.సైబర్ నేరాలు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. గత ఏడాది సైబర్ కేసులు భారీగా నమోదయ్యాయని, డ్రగ్స్ వినియోగం మారుమూల ప్రాంతాల వరకూ విస్తరించిన విషయం ఆందోళన కలిగిస్తోందని, నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని హాజరైన ఉద్యోగులందరికీ సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పదమైన ఆన్‌లైన్ లింకులు, కాల్స్‌కు స్పందించకూడదని, ఫ్రాడ్ అవుట్‌లను నివారించేందుకు 1930 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉందని,ప్రజలందరూ గమనించి, అనుమానాస్పదమైన కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు లేదా సంబంధిత హెల్ప్‌లైన్లకు సమాచారం ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమము కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం గారితో పాటు డీజీఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, ఇతర విభాగాల అధిపతులు, అధికారులు , వారి జనరల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.