బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నాలుగవ రోజుకు చేరుకున్న ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల బంద్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

భువనగిరి:-తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం చేపట్టిన నిరవధిక బంద్ గురువారం నాలుగవ రోజుకూ కొనసాగింది.ఈ సందర్భంగా గురువారం రోజున భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు ధర్నా నిర్వహించారు.అనంతరం డి.ఏ.ఓ రాధ కి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ,పీజీ కళాశాలల అసోసియేషన్,మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధి అసోసియేట్ ప్రెసిడెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నాలుగవ రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలు బంద్‌లో పాల్గొన్నాయి.కళాశాలల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దెబ్బతింటోంది.ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి.స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మరింత తీవ్రంగా జరుగుతాయి అని అన్నారు.శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాధ్యతతో వ్యవహరించాలి.ప్రైవేట్ కళాశాలలు విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.బకాయిలు విడుదల చేస్తేనే కళాశాలలు సజావుగా కొనసాగుతాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ,పీజీ కళాశాలల అసోసియేషన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధి అసోసియేట్ ప్రెసిడెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్,శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చిక్క ప్రభాకర్,జాగృతి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మనిపాల్ రెడ్డి,అలాగే పలు కళాశాలల ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం