Breaking News

1 కోటి రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్కును కానిస్టేబుల్ కుటుంబానికి అందించిన ఎస్పి

సూర్యాపేట నరసింహ ఐపిఎస్

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

పోలీస్ సాలరీ ప్యాకేజీ ఎస్బిఐ బ్యాంక్ అంకౌంట్ ఇన్స్యూరెన్స్ ద్వారా 1 కోటి రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్.
కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో అకాలంగ మరణించిన కానిస్టేబుల్ రాంబాబు కుటుంభానికి స్టేట్ బ్యాంక్ పోలిస్ సాలరీ ప్యాకేజీ ద్వారా ఒక కోటి రూపాయల సాలరీ ప్యాకేజ్ ఎస్బిఐ ఇన్స్యూరెన్స్ చెక్ ను జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ తన కార్యాలయం నందు అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు పోలీసు లకు ప్రత్యేక సాలరీ ప్యాకేజీ ఇవ్వడం జరిగినది. పోలీసు సిబ్బంది మరణించిన క్రమంలో ఈ పోలీస్ సాలరీ ప్యాకేజ్ అకౌంట్ ద్వారా 1 కోటి రూపాయల ఇన్స్యూరెన్స్ అందిస్తుంది. ఈ స్కీం ద్వారా రామాబాబు కుటుంబ సభ్యులకు రూ.1 కోటి చెక్కు అందజేయడం జరిగినది అని, ఈ స్కీం పోలీసు కుటుంబాలకు ఎంతగానో ఆర్థిక బాసటగా నిలుస్తుంది అని ఎస్పి అన్నారు. సిబ్బంది అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ స్కీం ను రూపొందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ల కి అభినందనలు తెలిపినారు.
ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి లు రవీందర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, ఏవో మంజు భార్గవి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు అనిల్ కుమార్, మోహన్ కుమార్, విద్యాసాగర్, సిబ్బంది ఉన్నారు.