బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

జిల్లాలో ఎక్కడా గన్ని సంచుల కొరత లేదని స్పష్టం అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

48 గంటల్లో గన్ని సంచుల సరఫరా

మన ప్రగతి న్యూస్ /ఖమ్మం జిల్లా

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, ప్రతిపాదనలు అందిన 48 గంటల లోపు వాటిని సంబంధిత కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేస్తున్నామని ఆయన వెల్లడించారు.ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులతో పాటు టార్పాలిన్ కవర్లు, తూకాల యంత్రాలు వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.ధాన్యం కొనుగోలు అవసరాల కోసం మాత్రమే గన్ని సంచులు ఉపయోగించాలన్నదే ప్రభుత్వ ఆదేశమని, రైతుల ఇంటి వద్దకు సంచులు పంపిణీ చేయరాదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 9 లక్షల 71 వేల 500 గన్ని సంచులు కేంద్రాలకు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. ఇంకా అవసరమైన సంచులు కేంద్రాల ఇండెంట్ల ప్రకారం సమయానికి సరఫరా చేస్తామని అన్నారు.గన్ని సంచుల కొరత జిల్లాలో ఎక్కడా లేదని, రైతులు భయపడవలసిన అవసరం లేదని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.జిల్లా పరిపాలన పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తామని, ఎక్కడైనా సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు.