Breaking News

అమరవీరుల ఆశయ సాధనకై పోరాడుదాం

బిజెపి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

రైతు సంఘం మండల కార్యదర్శి ఎర్ర గొర్ల రామారావు

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ములకలపల్లి మండలం లో తోగ్గుడెం,చితలగుంపు గ్రామలలో అమరవీరుల వర్ధంతి కార్యక్రమలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభాలను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల నాయకుడు యర్రగొర్ల రామారావు మాట్లాడుతూ.భూమి,బుక్తి,విముక్తి పోరాటం లో వీర మరణం పొందిన అమరులకు మరణం లేదని,విప్లవ ఉద్యమం లో వారు జీవించి ఉంటారని,దున్నే వానికి భూములు కావాలని,దోపిడీ,రాపిడి,పీడ,అణిచివేత లేని,స్వేచ్ఛ గా బతికే సమాజం కావాలని,అందరికి సమాన అవకాశాలు ఉండే నూతన సమాజం నిర్మాణం కోసం ఎందరో వీరులు తమ అమూల్యమైన ప్రాణాలు ఇచ్చారాని,పిడిత ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారాని,వారి ఆశయాలు సాధించడానికి ప్రజాపంథా పోరాటాలే మార్గం అని,ప్రపంచ దేశాలలో సామ్రాజ్య పెట్టుబడి విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తున్నాయి అని,భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున్న తిరుగుబాటు వస్తున్నాయి అని,పాలక ప్రభుత్వాలు ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నాయి కానీ సమస్య పరిష్కారం చేయడం లేదని,ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేసి ఉద్యమాలని ఆపలేరు అని అన్నారు.100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ప్రత్యేకించి 58 ఏళ్ల భారత కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ప్రజల కోసం ఈ దేశ మార్పు కోసం ప్రజాతంత్ర సోషలిస్టు విప్లవం కోసం పోరాడి ఎంతోమంది తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు అని అన్నారు.రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అమరవీరుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు.బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కులతత్వ మతతత్వ రాజకీయాలను రెచ్చగొడుతూ పేద ప్రజల పైన దళితుల పైన మైనార్టీల పైన దాడులు చేస్తుంది వారి హక్కుల కోసం పోరాడుతున్న విప్లవ పార్టీ నాయకులను ఎన్కౌంటర్ పేరుతోనీ చంపుతున్నారు.ఆపరేషన్ కగార్ పేరుతోటి అడవిలో ఉన్న సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధంగా అడివి హక్కులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆదివాసుల గిరిజనుల పైన తీవ్రమైన నిర్బంధాన్ని పెట్టింది బూటకపు ఎన్కౌంటర్ చేస్తూ వందల మందిని చంపుతున్నారు.పోడు భూములు చేసుకున్న రైతులకు నేటికీ పట్టాలిచ్చే పరిస్థితి లేదు.అడవిని కాపాడుతున్న ఆదివాసులపై కుట్ర కేసుల పెడుతూ అడవి సంపదను కూడా దోచుకుంటున్నారు
అకాల వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నష్ట పరిహారం అందించడం లేదు అని అన్నారు.బిజెపి మోడీ ప్రభుత్వం కుల,మత,దేవుడు పేరుతో ప్రజలను విభజిస్తూ పాలన చేస్తున్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు.వీరికి బుద్ధి చెప్పే విధంగా హామీలు అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచారు.అమరుల ఆశయా సాధనకై పోరాడుదాం అని అన్నారు.కార్యక్రమంలో మడివి రమేష్,మడివి ఇరుము,మడకం సంతోష్,మడకం ఇరుము,మడివి రాము,కోవసి హైతు,పున్నెం రమేష్,మడకం లక్ష్మణ్,మాడివి మహేష్,పోడియం రాజు మరియు సోడే భద్రు తదితరులు పాల్గొన్నారు.