బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

దానవాయి గూడెం గురుకులాన్ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతాం

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

గురుకుల అభివృద్ధికి రూ.3.80 కోట్లు మంజూరు భవన మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

దానవాయి గూడెం గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆదర్శ వంతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెంలో ఉన్న టి.జి.ఎస్.డబ్ల్యు.ఆర్. బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల భవన మరమ్మతు పనులకు బుధవారం మంత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.మంత్రి మాట్లాడుతూ.. గత సంవత్సరం మున్నేరు నదికి వచ్చిన భారీ వరదల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు రూ.3 కోట్ల 80 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు.
ఈ నిధులతో ఎర్త్ ఫిల్లింగ్, అంతర్గత సిసి రోడ్లు, కాంపౌండ్ వాల్, వెయిటింగ్ హాల్, జనరేటర్ ఏర్పాటు వంటి పనులు చేపడతామని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన కాంపౌండ్ వాల్ పనులు పూర్తి చేయాలని సూచించారు.బాలికల క్రీడా ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. స్థానికంగా క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటుకు అవకాశం పరిశీలించాలన్నారు.ప్రతి రూపాయి బాలికల ప్రయోజనానికి ఉపయోగపడేలా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి, అని మంత్రి తెలిపారు. గతంలో పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఫర్నిచర్ అందించామని, గురుకుల పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు.
విద్యార్థులు జీవితంలో లక్ష్యం నిర్దేశించుకొని కృషి చేయాలని, తల్లిదండ్రులను గౌరవించాలని మంత్రి సూచించారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ..మంత్రి చొరవతో గురుకుల పాఠశాలకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించి పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు.పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల అభివృద్ధికి వాలీబాల్ కోర్టు, ల్యాబ్ పరికరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ..గురుకుల పాఠశాలల్లో ఉన్నతాధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను పరిశీలించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, వ్యవసాయ అధికారి పుల్లయ్య, సహకార అధికారి గంగాధర్, ఉద్యానవన అధికారి మధుసూదన్, ఇర్రిగేషన్ ఎస్ఇ వెంకటేశ్వర్లు, ఆర్అండ్‌బి ఎస్ఇ యాకోబ్, ఆర్డీవో నర్సింహారావు, ప్రిన్సిపాల్ విజయదుర్గ, విద్యాశాఖ ఇఇ బుగ్గయ్య, మరియు పలు అధికారులుతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.