Breaking News

అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సుడిగాలి పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గంలో గండుగులపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి, యువభారత్ శక్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, “చదువు వల్లనే నేను ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పారు. చదువుతో ఉన్నత శిఖరాలకు విద్యార్థులు చేరుకోవచ్చని చెప్పారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో దమ్మపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు 11 లక్షల 2400 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రజల బాధలో నేను కూడా భాగమే, పేద ప్రజలకు సహాయం అందించడం నా బాధ్యత,” అని చెబుతూ, పేద కుటుంబాలకు ఉపశమనం అందించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఈ క్రమంలోనే అన్నపురెడ్డిపల్లి మండలం, కట్టుగూడెం, నరసాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతులతో పంట పరిస్థితుల గురించి చర్చించారు. “రైతు చెమట చుక్క చాలా విలువైనది, పంట కొనుగోలు త్వరితగతిన జరగాలి, ఎక్కడా ఆలస్యం ఉండకూడదు” అని అధికారులకు పలు చేశారు. రైతు సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వినాయకపురం, వేదాంతపురం గ్రామాలలో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించారు. ప్రతి అర్హుడికి ఇందిరమ్మ గృహం కట్టించడమే మన కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం అని చెబుతూ, పేదల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు. అశ్వారావుపేట క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు 5,20,500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను పంపిణీ చేశారు. సేవలోను, అభివృద్ధిలోను ఎలాంటి రాజకీయాలు సబబు కాదు, అలాంటి రాజకీయాలు నేను చేయనని, రాజకీయాలు పదవికే కాదు, ప్రజా సేవకే అంకితం అని పేర్కొంటూ, ప్రజల కష్టాల్లో తాను ఎప్పుడూ అండగా ఉంటానని, తన తలుపులు ఎప్పుడూ ప్రజాసేవ కోసం తెరిచే ఉంటాయాని స్పష్టం చేశారు. ఈ దిశలోనే అశ్వారావుపేట మండల కేంద్రంలోని మినీ స్టేడియం మరియు రోడ్ల విస్తరణ పనులను పరిశీలించారు. యువత క్రీడల్లో ముందుకు రావడానికి స్టేడియం అవసరం ఉందని గుర్తించి, స్టేడియం నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేస్తున్నానని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల తగ్గింపు కోసం రోడ్ల విస్తరణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జరిపిన పర్యటనలో భాగంగా పర్యటన పొడవునా ప్రతి గ్రామంలో ప్రజలు, యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారని, డప్పులు, పూలు చల్లుతు ఎమ్మెల్యేకి ఘన స్వాగతాన్ని ప్రజలు పలికారు. ఈ కార్యక్రమలో మండల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి