శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు
మనప్రగతిన్యూస్/ పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :
శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని టి పి సి సి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు.
కార్తీకమాసం చివరి సోమవారాన్ని పురస్కరిం
చుకుని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిం
చారు.ఈ సందర్భంగా ఝాన్సిరెడ్డికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు.అనంతరం ఆమె పార్టీ నాయకులుతో కలిసి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక హరతి ఇచ్చారు. కొద్దిసేపు ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ కార్తీకమాసం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని,ఈ పవిత్ర నెలలో చేసే పూజలు ప్రతి ఒక్కరికి అష్టౌశర్యాలు పాటు శాంతి,సౌభాగ్యాలను తీసుకువస్తాయని తెలిపారు. స్థానికులు దేవాలయ అభివృద్ధి సంబంధిత అంశాలను వారి దృష్టికి తీసుకురాగా, ఇటీవలే ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే యశ్వనిరెడ్డి ఆలయాన్ని సందర్శించారని,వీటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్మ పర్సన్ లావుడ్యా మంజుల భాస్కర్, బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యన్నారాయణ, సోమన్న ఆలయ మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి యాదవ్, ఓబిసి రాష్ట్ర నాయకులు పులి గణేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు కమ్మగాని నాగన్నగౌడ్, మండల నాయకులు పెనుగొండ రమేష్ పన్నీరు వెంకటేశ్వర్లు ఆకుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


