మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి:
మాటకద్రవ్యాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలని పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎస్సై దూలం పవన్ కుమార్, మేకల లింగారెడ్డిలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ జానకిరామ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నిర్మూలించాలని కృత నిశ్చయంతో నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణపై, దుష్ప్రభాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల సొసైటీకి కలిగే హానికర ప్రభావాలపై అవగాహన పెంపొందిస్తూ, సమాజ శ్రేయస్సు కొరకు మాదక ద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని, వాటిని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వాటి నిర్మూలన కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని, యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని, మాదకద్రవ్యాల రహిత సర్కిల్ గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటు
న్నారన్నారు.మాదకద్రవ్యాల వినియోగాన్ని పాలకుర్తి మండలంలో పూర్తిగా రూపుమాపేందుకు ఉద్యమంలా ప్రతీ ఒక్కరూ కదిలి రావాలన్నారు. మండలంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, మాదకద్రవ్యాలను సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువత, స్థానికులు పాల్గొన్నారు.

