Breaking News

ఇంగ్లీషు పఠన నైపుణ్యాల పెంపే లక్ష్యం

ప్రతి పిల్లవాడు చదవాలి అమలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

జిల్లాలోని ప్రతి విద్యార్థి ఇంగ్లీషు పఠన నైపుణ్యాలను మెరుగుపరచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. మంగళవారం వైరా మున్సిపాలిటీలోని గుట్టబడి ప్రాథమిక పాఠశాల, రెబ్బవరంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సిపిఎస్ కేంద్ర ప్రాథమిక పాఠశాలలో ప్రతి పిల్లవాడు చదవాలి’ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.తరగతి గదులను సందర్శించిన ఆయన, విద్యార్థులు ఇంగ్లీషు అక్షరాలు, పదాలు, పద్యాలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, ఉచ్ఛారణల ఆధారంగా పదాలను గుర్తించగలుగుతున్నారా అనే విషయాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.తదుపరి రెబ్బవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి బోర్డు పరీక్షలకు ఒత్తిడిలేకుండా సిద్ధమయ్యే విధానంపై సూచనలు ఇచ్చారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ…విద్యార్థుల్లో చదివే సామర్థ్యం పెంపు కోసం ప్రత్యేక బుక్‌లెట్ రూపొందించాం. ప్రతిరోజూ ఒక గంట ఈ అభ్యాసం తప్పనిసరి. కార్యక్రమం పర్యవేక్షణ కోసం రూపొందించిన యాప్ ద్వారా ప్రతి బుధవారం విద్యార్థుల పఠన స్థాయి నమోదు చేయాలి అని తెలిపారు.నెలరోజుల్లో ప్రతి విద్యార్థి ఒక పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఇఓ దీక్షారైనా, విద్యాశాఖ సిఎంఓ ప్రవీణ్, వైరా తహసీల్దారు శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.