బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

మట్టిని తరలిస్తున్న కాంట్రాక్టర్లపై..చర్యలు ఉండవా…?!

  • గుట్టలు మాయం.. ప్రకృతికిగాయం
  • సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు
  • అశ్వరావుపల్లి గ్రామం సర్వేనెంబర్ 241 లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలి

మన ప్రగతి న్యూస్/రఘునాథపల్లి:

రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లి గ్రామంలో
సర్వే నెంబర్ 241 లో ఉన్న ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి అక్రమాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని మరియు అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం రఘునాథ్ పల్లి మండలం లోని అశ్వరావుపల్లి గ్రామంలో ఎర్రబోడు గుట్టలను అక్రమాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను సిపిఎం రఘునాథ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా రాజు పాల్గొని మాట్లాడుతూ గత
కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు సర్వే నెంబర్ 241 ప్రభుత్వ భూమి లో మట్టి తోవ్వుకుంటూ హిటాచి టిప్పర్లతో మట్టిని అమ్ముకోవడం జరుగుతుందని , ఇలా మట్టి తీసుకుపోవడాన్ని మండల తహసి ల్దార్,మైనింగ్ అధికారులకు మెమోరాండాలు ఇచ్చిన పట్టించుకోక పోగా దీనిని అడ్డుకున్న సిపిఎం పార్టీ పట్టించిన హిటాచి టిప్పర్లను సీజ్ చేయక పోగా వారిపై కేసులు పెట్టక అలసత్వంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. ఇలా గుట్టలు తీసుకుంటూ పోతే గుట్టల మీద నివసించే జంతువులు, పక్షులు, వృక్ష సంపద లేకుండా కనుమరుగవుతుందని వారన్నారు, గుట్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఇది ఇలానే కొనసాగితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్,మండల కమిటీ సభ్యులు పొదల నాగరాజు, నామాల యాదగిరి, పొదల లవ కుమార్, వెంకటేశ్వర్లు, మండలి సంపత్, సరేందర్, మహేందర్,నరసయ్య, కుమార్,ఎల్లయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు