_ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ
_ ప్రభుత్వ విప్,ఆది శ్రీనివాస్
_ హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.
మన ప్రగతి న్యూస్ /
సిరిసిల్ల జిల్లా స్టాపర్
అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.చందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో మహిళా ఉన్నతి.తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు.ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో చీరలు పంపిణీ మొట్టమొదట మల్యాల గ్రామం ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఆకాశంలో సగం మహిళలు కాబట్టి ఆకాశంలో ఉన్న నీలి రంగు చీరలు సెలక్ట్ చేశామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో లక్ష 45 వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాలలో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, తహసీల్దార్ భూపతి తదితరులు పాల్గొన్నారు.

