బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వెల్లుట్లలో మహిళల సంబురం కోటి చీరల మహోత్సవం

కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామంలో ఆదివారం నిజమైన పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ మహత్తర సంకల్పం అయిన కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, మహిళా సంఘాలకు ఇందిరా శక్తి చీరలను ఘనంగా అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహిళల సంక్షేమమే మా ప్రభుత్వానికి ప్రాముఖ్యత. ప్రతి మహిళకు ఇంటికి వెళ్లి నాణ్యమైన చీరలను అందించడం మా ప్రభుత్వ సంకల్పం. పేద మహిళల గౌరవం, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ చీరల పంపిణీ ప్రారంభించాం అని తెలిపారు. అలాగే ఆయన గత ప్రభుత్వాన్ని ఎత్తిచూపుతూ గత ప్రభుత్వం పేదలు, మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మహిళల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం వంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చే బాధ్యతాయుత ప్రభుత్వం ఇది అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మహిళలను, ప్రజలను పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ తో పాటు బీసీ సెల్ మండల అధ్యక్షుడు కమ్మరి భాస్కర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు యామ సాయిలు, ఉపాధ్యక్షుడు ఎండపల్లి రవి, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు భాగ్యతో పాటు అనేక మంది మహిళా సంఘం సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల శక్తికే ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమే దానికి ఆదర్శం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ అన్నారు.