Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు

పర్యాటక శాఖ సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట జిల్లా స్టాపర్

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలన్న ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలో జి వి వి పంక్షన్ హాల్ లో నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గమునకు చెందిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా పర్యాటక సంస్థ చైర్మన్ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు నేరుగా మహిళల ఖాతాలోకి జమ అవుతాయని, మహిళలకు 30 లక్షలు రుణాలు ఇచ్చి ఆర్టీసీ బస్సు కొనుగోలు చేసి లీజ్ కు తీసుకొని నెలకు 70,000 ఆదాయం వచ్చేలా చూస్తున్నామని, సోలార్ ప్లాంట్స్, పెట్రోల్ బంక్ లు ఏర్పాటు కు రుణాలు ఇచ్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని అలాగే మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుట నాణ్యమైన చీరలను సారేగా మార్చి ఇస్తున్నామని అన్నారు.
తదుపరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని,మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా, రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు.మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, వాళ్ల పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని,ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని, మహిళలు పెట్రోల్ బంక్ లు నిర్వహించుకొనేలా ప్రోత్సహించామన్నారు. ఆర్టీసీలో వెయ్యి బస్సులను మహిళలకు యజమానులను చేశామని, వడ్డీలేని రుణాలు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ పంప్ ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ లాంటి కార్యక్రమాలను మహిళా సంఘాలకే అప్పగించామని గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని వదిలేయగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని గుర్తుచేశారు తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారే పెట్టి గౌరవించాలని ఉద్దేశంతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని, స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర ఇస్తున్నామని తెలియజేశారు..అనంతరం సూర్యాపేట నియోజకవర్గం లోని నాలుగు మండలాలకు చెందిన 1998 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు కింద 1.51 కోట్ల చెక్కును, ఇందిరా మహిళా శక్తి చీరలను లబ్ధిదారులకు అందజేశారు.సూర్యాపేట నియోజకవర్గం లో 40533 మంది లబ్ధిదారులకు చీరలు పంపిణి చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆర్డీఓ వేణు మాధవ్, తహసీల్దార్ కృష్ణ య్య, ఏ పి డి సురేష్, ఎంపిడిఓ బాల కృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.